Home » Telangana » Karimnagar
ఓసీపీ-3 ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన రెండు మోటార్ గ్రేడర్లను గురువారం జీఎం బండి వెంకటయ్య ప్రారంభించారు. బేస్‌వర్క్‌షాప్‌లో రెండు యంత్రాలకు పూజలు చేసిన అనంతరం వినియోగంలోకి తెచ్చారు.
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, దొంగతుర్తి, పైడిచింతలపల్లి, ఖానంపల్లి గ్రామాలలో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెం దుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం అందుగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంజయ్య మద్దతుగా గురు వారం ఉదయం ప్రచారం నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్ ఆదేశించారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ని సర్ధాపూర్ వ్యవసాయమార్కెట్ యార్డులో గోదాముల్లో ఉన్న ఎలక్ర్టానిక్ ఓటిం గ్ మిషన్(ఈవీఎం)లను బుధవారం ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతేలతో కలిసి ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్‌రెడ్డి పరిశీలించా రు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోడైవర్లను డ్రైవర్ నుంచి ఓనర్ చేయాలని చూస్తే రేవంత్‌రెడ్డి పా లనలో ఓనర్ నుంచి ఆటోడ్రైవర్ అవుతున్నారని మాజీ మంత్రి, సిరి సిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ నాయకుడిగా చెప్పుకుంటున్న హరీష్‌రెడ్డి ముఖమే తమకు తెలియదని, అతడిని ఎన్నడూ చూడలేదని గోదావరిఖని గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం నాయకులు మేరుగు గట్టయ్య, మొగిలి కడి యాల జంపయ్య, మేరుగు రాజేష్‌లు పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళా శాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కోడూరి రమేష్ మాట్లాడారు. విద్యార్థులు, యువత మానవ హక్కులు, చట్టాలపై తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.