Home » Telangana » Karimnagar
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని, రైతులు పండించిన చివరి గింజ వరకూ కోనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తరూపు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాయి. కార్పొరేట్ కిడ్స్ స్కూల్స్ తరహాల్లో అంగన్వాడీ కేంద్రాలను మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రస్తుత అంగన్వాడీ కేంద్రాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా ఆదివారం తొలిరోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో జగిత్యాలలో 22, కోరుట్లలో 8, జగి త్యాలరూరల్ మండలం జాబితాపూర్‌లో ఒకటి, మల్యాల మండలం రామ న్నపేటలో ఒకటి, కొడిమ్యాల మండలం జెఎన్టీయూలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్ కంపోనెంట్ కింద జనరేట్ అయ్యే నిధులను అయిన కాడికి ముందస్తుగానే శాశ్వత నిర్మాణ పనులకు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసే ఫిబ్రవరి, మార్చి నెలలోనే చేపట్టే ఆఘమేఘాల పనులకు స్వస్తి పలకాలని నిర్ణయించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్షకు రెండు, మూడు నిమిషాల తేడాతో పలువురు అభ్యర్థులు దూరమయ్యారు. పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 25 కేంద్రాల్లో మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.
రెండు రోజులు గా కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని చలి వణికిస్తున్నది.
ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పూర్తిస్థాయి అమలులో ప్రభుత్వం విఫల మైందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు.
రామగుండం నియోజనకవర్గంలో బీ ఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు.
జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్షకు మొదటి పేపర్‌కు 50.93 శాతం, రెండవ పేపర్‌కు 49.62 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులోభాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చి... ప్రజల్లో చైతన్య కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితంగా ఉంచేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.