Home » Telangana » Medak
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.
త్వరలోనే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాటి చెట్లు ఎత్తు తక్కువ ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. స్థలం ఉంటే బోర్లు వేసి చెట్లను నాటి కాపాడుకోవాలని అన్నారు.
Telangana: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు నిరసన తెలపడంలో తప్పులేదని.. కానీ అధికారులపై దాడి చేయడం తప్పన్నారు. కలెక్టర్‌ను కొట్టే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. పైనున్న నాయకుల ప్రోత్సాహం వల్లనే కదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలసి 11 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెలు పెద్ద స్కామని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వార్నింగ్ ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహా కావద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుందని ఆరోపణలు చేశారు.
Telangana: డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవుతున్న ఓ విద్యార్థిని ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్‌కు వచ్చింది. అయితే ఆమె వెంటే ఉన్న అపాయాన్ని గుర్తించ లేకపోయింది విద్యార్థిని. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న సమయంలో యువతికి అనుకోని ప్రమాదం ఎదురైంది. తప్పించుకుందామని అనుకునే లోపే తీవ్ర గాయాలపాలైంది సదరు యువతి.
Telangana: సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా ఆందోల్‌లో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు స్వయంగా బాబు మోహన్ ప్రకటించారు.
ఈమె పేరు సున్నపు భవానీ. సంగారెడ్డి(Sangareddy) జిల్లా కోహీర్(Kohir) మండలం గురుజువాడ(Gurujuwada) అనే మారుమూల గ్రామంలో నివసిస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయింది.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
ఓ కలెక్టర్‌కు తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని, దీంతో తనకు కోసం వచ్చి తిట్టానంటూ బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత కలెక్టర్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా లేదంటే గతంలో ఎప్పుడైనా జరిగిన సంఘటనను ..