Home » Telangana » Nalgonda
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లాలో చివరగా ఉన్న కోదాడ మండలంలో పలు చౌరస్తాలు, మలుపులు ప్రమాదాలకు అలవాలంగా నిలుస్తున్నాయి.
ఎన్నో ఏళ్లుగా మండలంలోని ముల్కలపల్లి- గొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న పీఆర్ రోడ్డు గుంతలు పడి, కంకర తేలడంతో ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా కలిసి పోరాడినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ హక్కుల సాధన సమితి సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ధనుంజయనాయుడు అన్నారు.
తాతయ్యా.. అంటూ శాన్ఫ్రాన్సిస్కో నుంచి వీడి యో కాల్లో పలకరించే మనుమరాలు ఇక లేదని తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 72రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మనుమరాలు కన్నుమూయటంతో నేరేడుచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గోమాత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి, చైతన్యవంతులను చేయాలని బాలకృష్ణగురుస్వామి పిలుపునిచ్చారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 18 రాష్ట్రాల మీదుగా సుమారు 7వేల కిలోమీటర్లు గోమాతతో చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర బుధవారం చౌటుప్పల్ పట్టణానికి చేరుకుంది.
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం వివక్ష చూపొద్దని, సమానత్వం చూపాలని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ వేలకోట్లు కేటాయించారన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమై న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్ పదవుల కోసం కీలక నాయకుల నడుమ పోటాపోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తేల్చుకోలేక సతమతమవుతున్నారు.
Telangana: నల్గొండ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. దేవరకొండ మండలం తాటికొల్కు చెందిన కొందరు యువకులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. సినిమా ఫైటింగ్ రేంజ్లో రోడ్డుపైనే పిడుగుద్దులు గుద్దుకున్నారు. తాటికొల్ యువకుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి పాల్పడ్డారు.
వ్యవసాయ పనుల్లో కూలీల కొరత కారణంగా రైతులపై అదనపు భారం పడుతోంది.
క్రిస్మస్ వేడుకలకు జిల్లా ముస్తాబు అయింది. క్రిస్టియన్లు రెండు రోజులపాటు జరగనున్న వేడుకలలో బుధవారం క్రిస్మస్ గురువారం బాక్సింగ్‌డేను జరుపుకోనున్నారు.