Home » Telangana » Nalgonda
భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థికసహాయం అందిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీఇచ్చింది. ఆ హామీని అమలుచేయాలన్న డిమా ండ్ పెరగడంతో ఈ నెల 28 నుంచి ఆ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
డివిజన్ పరిధిలో ని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం, భూసేకరణతోపాటు రెవెన్యూ సమస్యలు జాప్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించారు. మం గళవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రమంత్రి అమిత్‌షాను కేబినెట్ నుంచి తొలగించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ చేపట్టిన నిరసనలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం భువనగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
నకిలీ వస్తువులపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది.. అందుకు అనుగుణం గా పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.. ప్రభుత్వ విద్యబలోపేతంతోనే అన్నివర్గాల పిల్లల కు నాణ్యమైన విద్య అందుతుంది.. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో చేసిన మార్పులతో త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది.
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ అంతటా ఒకేలా ఉండాలని, అందుకు విరుద్ధంగా ఉన్న అలైన్‌మెంట్‌ను మా ర్చాలని భూ నిర్వాసితుల ఐక్యవేదిక డిమాండ్ చేసిం ది. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిం చి కలెక్టర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5లక్షల ఆర్థిక సాయం అందించనుంది. అందుకు ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా సర్వే నిర్వహిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత ప్రకటించిన రుణమాఫీ నిధులు ఇంకా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. రుణమాఫీ కోసం రైతులు నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో ప్రజల నుం చి కలెక్టర్ హనుమంతరావు అర్జీలు తీసుకొని వారి సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చారు.