Home » Telangana » Nalgonda
అకాల వర్షాలు రైతులను కకావికలం చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆగస్టు 30, సెప్టెంబరు 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ఎడమకాల్వకు, ముక్త్యాల బ్రాంచ్ కాల్వకు గండ్లు పడ్డాయి.
జిల్లా కేంద్ర సమీపంలోని 12వ బెటాలియన్‌లో పోలీసుల కుటుంబ సభ్యు లు సమస్యల పరిష్కారం కోరుతూ పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం నాడు అనూహ్యంగా రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఏళ్లుగా బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీరాందేవ్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించారు.
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని, తరిమికొడతామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.
మూసీ పునరుజ్జీవం చారిత్రక అవసరమని, మూసీ ప్రక్షాళన, సుందరీకరణను ప్రజలు కోరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం వైటీడీఏ ద్వారా స్థానికంగా పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఆలయ సింహద్వారానికి ఎదురుగా ఉన్న రోడ్డును విస్తరించిం ది.
రామన్నపేట సమీపంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై కాలుష్య నియంత్రణమండలి ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధమైంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రామన్నపేట మండలవాసులతోపాటు నల్లగొండ జిల్లా చిట్యాల మండల ప్రజలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనానికి నల్లగొండ జిల్లా చక్కని వేదిక అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన 21 మంది ఆలిండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుంది.
వచ్చే 10 రోజుల్లో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును నీటితో నింపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
జిల్లాలో 2024-25కు సంబంధించిన ఓటరు జాబితా సవరణను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనపై సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.