Home » Telangana » Nalgonda
పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపడం లేదు.
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ క్విజ్ పోటీల్లో కోదాడకు చెందిన తేజ పాఠశాల విద్యార్థి గుజ్జుల హర్షవర్ధనరెడ్డి విజేతగా నిలిచాడు. దేశవ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 30 వరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్-2024 పేరున పోటీ నిర్వహించింది.
భగవంతుడి లీలలు, కథలు, చరిత్ర చదివినా, విన్నా ఆయన నామస్మరణ చేసినా మానసిక ప్రశాంతత లభిస్తుందని నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానందసరస్వతీ అన్నారు. మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ‘శివ లీల విలాస, విజ్ఞానం’పై ఆయన ప్రవచించారు.
జనగామ జిల్లా పేరును పాపన్న జిల్లాగా మార్చాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని నూతన వీసీ అల్తాఫ్ హుస్సేన అన్నారు. శనివారం వీసీ(ఉపకులపతి)గా బాధ్యతలు స్వీకరించారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పటకినీ అందులో మెరుగైన పరిస్థితులు కానరావడం లేదు.
అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాల్వ నిర్మాణం పూర్తి చేసేందుకు నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా రూ.266.65కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. బునాదిగాని కాల్వకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), బీబీనగర్, భువనగిరి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు వేర్వేరుచోట్ల 44జీవాలు మృతి చెం దాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షలకు కేంద్రాలను సిద్ధంచేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
హాస్టళ్లు తెరిచి మూడు రోజులు గడిచినా వార్డెన్లు విధులకు హాజరుకావడంలేదు. దీంతో సెలవుల్లో ఇంటికి వెళ్లిన విద్యార్థులూ హాస్టళ్లకు రావడం లేదు. విద్యార్థులు రానందున వండి, వడ్డించే పని లేదని వర్కర్లూ రావడం లేదు.