కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. అంతేకాకుండా బనకచర్ల ప్రాజెక్ట్‌పై సైతం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు.
జిల్లాలో మోస్తారు వర్షాలు మాత్ర మే కురిశాయి. కనీసం మెట్ట పంటల కు కూడా పూర్తి స్థాయిలో కలిసిరాని పరిస్థితి. భారీగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా భూ గర్భజలాలు గణనీయంగా అడుగంటుతున్నాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథ కం టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య భరోసా ఇచ్చారు.
సీజన్ తొలిరోజుల్లో మురిపించిన వరుణుడు తర్వాత కానరాకుండా పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. చినుకామ్మ జాడ ఇవ్వాళో, రేపో కానరాకుండా పోతుందానని ఎదురు చూస్తు న్న కర్షకుల కళ్లలో కన్నీరు తప్ప, ఆనందం లేదు.
సామాజిక భద్రతా పింఛన్‌దారులను ఫేస్ రికగ్నైజేషన్ కష్టాలు వేధిస్తున్నాయి. ఇన్నాళ్లు వేలిముద్రల ద్వారా తీసుకున్న పింఛన్‌కు ఇక నుంచి ముఖ ఆధారిత హాజరు అమలు చేస్తుండడంతో తిప్పలు తప్పడంలేదు. సాంకేతిక సమస్యలు ఓ వైపు, నెట్‌వర్క్ లేక మరోవైపు పంచాయతీ కార్యదర్శులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలోని గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. విద్యాశాక ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖాళీలను ప్రకటించి అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నారు.
రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ సిద్ధమవుతోంది. పవర్‌ప్లాంట్ నిర్మాణం లో ఒక్కో ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేస్తున్న జెన్‌కో యంత్రాంగం విద్యుదుత్పాదన చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను ఒక్కోటిగా నెరవేరుస్తోం ది.
వాహనాలన్నింటికీ హెచ్‌ఎ్‌సఆర్సీ (హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్) బిగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. వాహనాలను కొనుగోలు చేసిన నెలరోజుల్లోపు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాటికి నూతన అడ్మిషన్లు 100 పూర్తయ్యాయి.