ఎల్ఆర్ఎస్ 25శాతం ఫీజు రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్ ఎం.హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని గడువులోగా రాయితీతో ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూ చించారు.
రాజీవ్ యువ వికాస్ పథకం నిరుద్యో గ యువతకు వరంలాంటిదని, యువత ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవే ట్ కళాశాలల యాజమాన్యాలు, వేతనాల కోసం లెక్చరర్ల బహిష్కరణ ప్రభావం డిగ్రీ ప్రాక్టికల్స్ పరీక్షలపై ప్రభావం చూపింది. ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమైనా, ప్రైవేట్డిగ్రీ కళాశాలలు తెరుచుకోలేదు.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం కింద తొలిసారి బియ్యం అందుకున్న మహిళలు ఆ బియ్యం బాగున్నాయని, అన్నం బాగా అయిందని సంబరపడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోంది. 103 ఏళ్ల బ్యాంకు చరిత్ర లో ఇప్పటి వరకు కేవలం రూ.900కోట్ల టర్నోవర్ ఉండ గా, ప్రస్తుతం రూ.2,850కోట్లకు పైగా టర్నోవర్కు చేరుకుంది.
అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రానికి భద్రత విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.1200 కోట్లతో నిర్మించిన ఆలయానికి భద్రత కొరవడినట్లు కన్పిస్తోంది.
ఆయుర్వేదం అనగానే గుర్తుకు వచ్చే మొక్కల్లో అశ్వగంఽధం మొదటివరసలో ఉంటుంది.ఈ మొ క్క సాగు వివరాలు అందరికీ తెలియదు.
మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో పనిచేసే సిబ్బందికి వేతనాలు అందడం లేదు.
చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 2,598 మంది ప్లాట్ల యజమానులు రూ.5.72కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించారు. మార్చి 31వ తేదీ సా యంత్రం 4 గంటలవరకు జరిగిన ఆన్లైన్ నమోదు ప్రక్రియలో 2,598 మంది ప్లాట్ల యజమానులు ఫీజు చెల్లించారు.
ఒకప్పుడు దూరంలో ఉండేవారి కులాసా లు ఇంటికి వచ్చే పోస్ట్కార్డ్(ఉత్తరం) ద్వారా నే తెలిసేవి. మనసులోని మాటలను, అన్ని విషయాలను సమగ్రంగా రాసి ఎదుటి వారి కి చేరువ చేసేలా గతంలో పోస్ట్కార్డులను విస్తృతంగా వాడేవారు.