బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో అన్ని బాధ్యతలకు రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని కవిత చెప్పుకొచ్చారు.
తన్నలకి ఎకరాకి రూ.50వేల పరిహారం, ఆడబిడ్డలకు తులం బంగారం, పింఛన్ల పెంపు ఎప్పుడిస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
నిజామాబాద్‌లో ఇటీవల హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం..
భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్ స్కూటీపై నలుగురు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది.
42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని తనపై కొంతమంది విమర్శలు చేసున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గ్రూపులను చేదరగొట్టారు. అనంతరం గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రశ్నించారు.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ అని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు.