Home » Telangana » Rangareddy
సమాచారం ఇవ్వకుండా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూ సర్వే పనులు ఎలా చేపడతారని రైతులు, వివిధ పార్టీల నాయకులు అధికారులను నిలదీశారు. ఇందుకోసం పోలీసులను ఎందుకు తీసుకొచ్చారని, దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కుంటారా అని మండిపడ్డారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధి రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్యకు గురైన కొంగర నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లి వాసులు డిమాండ్ చేసారు. చెర్లపల్లి నుండి రాంపల్లి మీదుగా కరీంగూడ వరకు ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే.
చోరీ కేసులో నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ కొడంగల్ మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి శ్రీరామ్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ జీవీ. సత్యనారాయణరెడ్డి తెలిపారు.
జీవనోపాధి కోసం వచ్చిన కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న ఆప్లికేషన్ ఫారాలు గల్లంతయ్యాయి. ఈమేరకు నిజమైన లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్ నమోదు సర్వేలో కనిపించడం లేదంటూ సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బుద్దుల జంగయ్య లబ్ధిదారులతో కలిసి కొం దుర్గు ఎంపీడీవో లక్ష్మీఅనురాధకు సోమ వారం వినతిపత్రాన్ని అందజేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేవుళ్లపై ఒట్లు పెట్టి, అధికారం రాగానే అన్నదాతలను అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తూపోతున్నదని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పిలుపుమేరకు సోమవారం ఫరూఖ్‌నగర్ మండల తహసీల్దార్ ఆఫీసు ఎదుట రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధర్నా చేపట్టారు. బీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఓ వెంచర్‌లో అక్రమంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని సోమవారం రాత్రి యాచారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన రవి, శ్రీనివా్‌సలు హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి పక్కన తమ్మలోనిగూడ గేటు సమీపంలో గల వెంచర్‌లో బండరాళ్లను డిటోనేటర్లతో పేల్చేందుకు యత్నించారు.
మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కందాడ కృష్ణయ్య(62) అదృశ్యమైనట్లు సీఐ నరహరి సోమవారం తెలిపారు.
బోలెరో.. కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పరమేష్ కథనం మేరకు..