Home » Telangana » Warangal
కడు పేదరిక జీవితాలు అవి. చెమట చిందిస్తేనే పూట గడుస్తుంది. కూలికి పోతేనే కూడు.. లేదంటే పస్తులే. పొద్దు పొడవక ముందే మొదలై సాయంసంధ్య వరకూ రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. పల్లెల్లో జీవన చిత్రంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. చంటి బిడ్డలను చంక దింపదింపలేక.. గుడిసెలో ఒంటరిగా వదిలి వెళ్లలేక అనేకమంది పేద తల్లులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇందన శాఖ జీవోఎంఎస్ నం.20 జారీ చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు విద్యుత్ తప్పనిసరి. బిల్లులు పేరుకుపోతే విద్యుత్ సంస్థ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది.
వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి. రైతన్న లకు సంపత్తి తెచ్చిపెట్టేది కాబట్టి దీన్ని తెల్లబంగారం కూడా అంటారు. అయి తే.. ఈ పంటకు ఇప్పుడు విపత్తు వచ్చింది. భారీ వర్షాలు ఏకదాటిగా కురవడంతో దీన్ని పండించే వారికి కంటతడే మిగిలింది. పత్తి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉండగా ప్రకృతి వైపరీత్యాల కారణం గా ఈ ఏడాది భూపాలపల్లి జిల్లా రైతులు నష్టాలనే చవిచూడాల్సి వస్తోంది.
Telangana: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్దని వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో ఉప ఎన్నిక రావని... వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జనగామ కాంగ్రెస్లో ముగ్గురు కోవర్టు నేతలు ఉన్నారని ఆరోపించారు.
జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు కసరత్తు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో దిగుబడి అయ్యే ధాన్యం, సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే ధాన్యం, అందుకు తగ్గ ఏర్పాట్లకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను అధికారులు ఇటీవల సిద్ధం చేసుకున్నారు. మరో 15 రోజుల నుంచి వానాకాలం వరి ఽకోతలు ఊపందు కోనున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అయ్యారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో అవసరమైన వసతుల కల్పన, నిర్వాహకులకు శిక్షణ వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల సిబ్బందికి వెతలు తప్పడం లేదు. సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగు లు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఎంత వెట్టిచాకిరీ చేస్తున్నా పనికి తగ్గ వేతనం వీరికి అందడం లేదు. మందరూ మహిళలే అయినప్పటికీ వారికి కనీసం ఆప్షనల్ హాలీడేస్ దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
ఈ ఏడాది పేద మహిళలకు బతుకమ్మ పండుగ చీరల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. గత ఏడేళ్లుగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన బతుకమ్మ చీరల పథకం ఏడు సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగింది.
గత కొన్నేళ్లుగా చెరువులు, కుంట శిఖాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చెరువు శిఖాల్లో వెంచర్ల పేరిట అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా కూడా అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.