Home » Telangana » Warangal
చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యసంరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతు న్నాయి. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. కానీ సరైన అవగాహన లేకపోవడం, పేదరికం కారణంగా చాలా మంది పోషకాహార లోపంతో పలు రుగ్మతల బారిన పడుతున్నారు.
ములుగు అభయారణ్య గర్భం వందల ఏళ్ల చరిత్రను పదిలంగా దాచుకుంది. ఎక్కడ తడిమి చూసినా.. తవ్వి శోధించినా అడుగడుగునా విస్తుగొలిపే వింతలు, విశేషాలే కనిపిస్తాయి. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపుతో కీర్తిపొందిన రామప్ప దేవాలయం కంటే పురాతనమైన చరిత్ర సాక్ష్యాలు అనేకం శిథిల జ్ఞాపకాలుగా ఉన్నాయి. తాడ్వాయి మండలంలోని దామెరవాయి, మంగపేట మండలంలోని మల్లూరు అడవుల్లో వెలుగుచూసిన డోల్మన్ సమాధులు ఆదిమ మానవుడి ఆనవాళ్లకు దారి చూపిస్తాయి.
Telangana: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా పథకం కోసం ప్రతీఒక్క రైతు ఎదురుచూస్తున్న నేపథ్యంలో మంత్రి ఇచ్చిన ప్రకటన ఊరటనిస్తుందనే చెప్పొచ్చు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతున్నారు.
పల్లె ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు. వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. మండలంలో 45 రోజుల్లో 75 మంది గాయపడ్డారు. కుక్కల దాడిలో గాయపడి చిట్యాల సామాజిక ఆస్పత్రిలో 62 మంది, ఒడితల పీహెచ్సీలో 13 మంది చికిత్స తీసుకున్నారు. మండ ల కేంద్రంలోని పలు వీధుల్లో నాలుగు రోజుల క్రి తం ఒకే కుక్క 10 మందిని గాయపర్చింది,
వేగంగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ రహదారి, రైల్వేస్టేషన్ ఉండటంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. కోర్టు కూడా మంజూరైంది. ఇన్ని ఉన్నా పురపాలక హోదాకు మాత్రం స్టేషన్ ఘన్పూర్ నోచుకోవడం లేదు. ఘన్పూర్ కంటే తక్కువ జనాభ, విస్తీర్ణం తక్కువ ఉన్న మండల కేంద్రాలను గత ప్రభుత్వం మున్సిపాలిటీగా చేసి ఘన్పూర్ను మాత్రం విస్మరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు, ఆ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూంటే ఈ ప్రాజెక్టు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతోందని తెలుస్తోంది. 2023 అక్టోబరులో లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీలోని ఏడో బ్లాకులో పిల్లర్లు కుంగిన తర్వాత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితుల అధ్యాయనానికి శ్రీకారం చుట్టింది.
Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ఎన్ఆర్ఎస్సీ, వాతావరణ శాఖ విచారణ చేపట్టింది. అడవుల్లో వాతావరణ పరిస్థితులను ఎన్ఆర్ఎస్సీ నమోదు చేసుకుంది. 2018 జనవరి 22న మేడారంలోని చిలకల గుట్టలో టోర్నడోలాంటి సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఆనాడు సుడిగాలి ఫోటోలను ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ వీరగోని హరీష్ క్యాప్చర్ చేశారు.
Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్పై విచారణ జరిగిందని.. సుదీర్ఘ వాదనలు జరిగాయన్నారు.
Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని వేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని... మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50వేల చెట్లు కూలాయన్నారు.