తిరిగి యూఏఈకి చేరిన 11 లక్షల మంది భారతీయులు!
ABN , First Publish Date - 2021-01-22T10:59:19+05:30 IST
కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి యూఏఈకి వచ్చినట్టు
అబుధాబి: కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి యూఏఈకి వచ్చినట్టు కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ అన్నారు. పీబీఎస్‌కే (ప్రవాసి భారతీయ సహాయత కేంద్ర) యాప్‌ను గురువారం రోజు దుబాయిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడియన ఆయన.. కొవిడ్ నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం మే 7న వందే భారత్ మిషన్ ప్రారంభించినట్టు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో యూఏఈలోని సుమారు 13లక్షల మంది భారతీయులు ఇండియాకు తరలి వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం వారిలో సుమారు 11.50లక్షల మంది తిరిగి యూఏఈకి వచ్చినట్టు వెల్లడించారు. మరో 1.50లక్షల మంది యూఏఈకి రావాల్సి ఉందన్నారు. అయితే కొద్ది మంది ఐసీఏ అప్రోవల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. ఆ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. అధికారులు వాటికి సంబంధించిన పనిపైనే ఉన్నట్టు చెప్పారు. కాగా.. ఫేక్ జాబ్ ఆఫర్లను నివారించడానికి పీబీఎస్‌కే యాప్.. భారత కార్మికులకు సహాయపడుతుందని వెల్లడించారు.