అమరరాజా లాభంలో 15శాతం వృద్ధి

ABN , First Publish Date - 2020-05-31T06:21:56+05:30 IST

మార్చితో ముగిసిన మూడు నెలలకు ఏకీకృత ప్రాతిపదికన అమరరాజా బ్యాటరీస్‌ రూ.137.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.119.08 కోట్లతో పోలి స్తే 15 శాతం...

అమరరాజా లాభంలో 15శాతం వృద్ధి

  • త్రైమాసిక ఆదాయం రూ.1,595 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మార్చితో ముగిసిన మూడు నెలలకు ఏకీకృత ప్రాతిపదికన అమరరాజా బ్యాటరీస్‌ రూ.137.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.119.08 కోట్లతో పోలి స్తే 15 శాతం పెరిగింది. 2019-20కి లాభం 51 శాతం పెరిగి రూ.438.23 కోట్ల నుంచి రూ.660.80 కోట్లకు చేరినట్లు అమరరాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.1,573 కోట్ల నుంచి రూ.1,595 కోట్లకు చేరగా.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2020 మార్చితో ముగిసిన సంవత్సరానికి ఆదాయం రూ.6,839.88 కోట్ల నుంచి రూ.6,894.22 కోట్లకు పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్లాంట్లు, కార్యాలయాల మూసివేత కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు అమరరాజా బ్యాటరీస్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ గల్లా తెలిపారు. ప్రభావాన్ని అంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 


Updated Date - 2020-05-31T06:21:56+05:30 IST