నవంబరులో 17 బ్యాంకు సెలవులు

ABN , First Publish Date - 2021-10-26T08:20:19+05:30 IST

నవంబరు నెలలో మీరు బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారా..? ఏ రోజు సెలవు, ఏ రోజు బ్యాంకులు తెరుచుకుని ఉంటాయి తెలుసుకుని వెళ్లండి.

నవంబరులో  17 బ్యాంకు సెలవులు

ముంబై : నవంబరు నెలలో మీరు బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారా..?  ఏ రోజు సెలవు, ఏ రోజు బ్యాంకులు తెరుచుకుని ఉంటాయి తెలుసుకుని వెళ్లండి. లేదంటే నిరాశతో తిరిగి రాక తప్పదు. వరుస పండుగలు, శని, ఆదివారపు సెలవు దినాలు కలిపి నెలలో మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవు దినాలున్నాయి. అయితే వీటిలో కొన్ని ఆయా రాష్ర్టాలకు మాత్రమే పరిమితం అయినా దేశం మొత్తం మీద కనీసం సగం రోజులు బ్యాంకులు పని చేయవని ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ద్వారా తెలుస్తోంది. నవంబరు 13, 27 తేదీలు రెండవ, నాల్గవ శనివారాలు, 7, 14, 21, 28 ఆదివారాలు ఇవి సాధారణ సెలవులే. కాగా మిగిలిన సెలవు దినాలు ఇలా ఉన్నాయి. 


నవంబర్‌ 1: కన్నడ రాజ్యోత్సవ్‌; 3: నరక చతుర్దశి;  4: దీపావళి అమావాస్య; 5: బలి ప్రతిపద/విక్రమ సంవత్సరం ప్రారంభం/గోవర్థన్‌ పూజ; 6: భాయి దూజ్‌/చిత్రగుప్త జయంతి; 10, 11: చాత్‌ పూజ; 12: వంగల ఫెస్టివల్‌; 19: గురునానక్‌ జయంతి/కార్తీక పౌర్ణమి; 22: కనకదాస జయంతి; 23 : సెంగ్‌ కుత్స్నెమ్‌ (వీటిలో కొన్ని  సెలవులు ఆయా రాష్ర్టాలకే పరిమితం). 

Updated Date - 2021-10-26T08:20:19+05:30 IST