అమరావతి: ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,85,616కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనా నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,138 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,338 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని రాష్ట్రవ్యాప్తంగా 8,76,140 మంది రికవరీ అయ్యారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా 276 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,90,916 కరోనా కేసులు నమోదు అవగా...1572 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు ఉన్నాయి.