యూఏఈ నుంచి మంగుళూరుకు మొదటి చార్టర్డ్ ఫ్లైట్

ABN , First Publish Date - 2020-05-30T17:21:29+05:30 IST

రాస్ అల్ ఖైమాలోని ఖైమ‌హ్ విమానాశ్ర‌యం నుంచి కర్నాట‌క‌లోని మంగ‌ళూరుకు జూన్ 1న మొద‌టి చార్టర్డ్ ఫ్లైట్ న‌డ‌వ‌నుంది.

యూఏఈ నుంచి మంగుళూరుకు మొదటి చార్టర్డ్ ఫ్లైట్

యూఏఈ: రాస్ అల్ ఖైమాలోని ఖైమ‌హ్ విమానాశ్ర‌యం నుంచి కర్నాట‌క‌లోని మంగ‌ళూరుకు జూన్ 1న మొద‌టి చార్టర్డ్ ఫ్లైట్ న‌డ‌వ‌నుంది. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో అక్క‌డ చిక్కుకుపోయిన సుమారు 180 మంది భార‌త ప్ర‌వాసులు ఈ విమానంలో స్వ‌దేశానికి రానున్నారు. ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్, క‌ర్నాట‌క నాన్‌-రెసిడెంట్ ఇండియ‌న్ ఫోర‌మ్‌(కేఎన్నారై) ప్రెసిడెంట్‌ ప్రవీణ్ శెట్టి ఈ స్పైస్ జెట్ విమానాన్ని స్పాన్స‌ర్ చేస్తున్నారు. ఆయ‌న హోట‌ల్స్‌కు చెందిన 105 మంది సిబ్బందిని స్వదేశానికి త‌ర‌లిస్తున్నారు. దుబాయిలోని కాన్సుల్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా విపుల్ మాట్లాడుతూ జూన్ 1న ఉద‌యం 9.45 గంట‌ల‌కు 180 మందితో ఈ విమానం బ‌య‌లుదేరుతుంద‌న్నారు. ఇప్ప‌టికే ప్రైవేట్ కంపెనీలు స్పాన్స‌ర్ చేసిన ప‌లు చార్టర్డ్ ఫ్లైట్స్ అబుధాబి నుంచి ఇండియాకు వెళ్లిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.    

Updated Date - 2020-05-30T17:21:29+05:30 IST