యూట్యూబ్ వీడియో తీయడానికి ప్రయత్నించి.. 656 అడుగుల లోయలో పడి..

ABN , First Publish Date - 2021-08-02T01:22:39+05:30 IST

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ట్రావెల్ వీడియోలు, సాహస కృత్యాలు చే

యూట్యూబ్ వీడియో తీయడానికి ప్రయత్నించి.. 656 అడుగుల లోయలో పడి..

రోమ్: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ట్రావెల్ వీడియోలు, సాహస కృత్యాలు చేసి పాపులర్ అవడం కోసం కొందరు యువతీ యువకులు ట్రై చేస్తారు. అలాంటి వారిలో డ్యానిష్ యూట్యూబర్ ఆల్బర్ట్ డైర్లండ్ కూడా ఒకరు. అయితే అతని కథ చివరకు విషాదాంతం అయింది. ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాల్లో వీడియో తీయడానికి ప్రయత్నించిన ఆల్బర్ట్.. 656 అడుగుల లోయలో పడి మరణించాడు. ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులు వెల్లడించారు. ఆల్బర్ట్‌ను కాపాడటం కోసం హెలికాప్టర్ కూడా పంపారని, అయినా ప్రయోజనం లేకపోయిందని తెలుస్తోంది. వాళ్లు వెళ్లే సరికే ఆల్బర్ట్ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ‘‘మేం చాలా బాధలో ఉన్నాం. కానీ అతని అభిమానులకు ఈ విషయం తెలియజేయాలని అనుకున్నాం’’ అని ఆల్బర్ట్ తల్లి చెప్పారు. 

Updated Date - 2021-08-02T01:22:39+05:30 IST