24 గంటల్లో 23 మంది మృతి

ABN , First Publish Date - 2020-10-19T09:17:29+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,945 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,986 మందికి వైరస్‌ సోకిందని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది.

24 గంటల్లో 23 మంది మృతి

కొత్తగా 3,986 కేసులు.. సచివాలయంలో ఏడుగురికి కరోనా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,945 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,986 మందికి వైరస్‌ సోకిందని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం బాధితుల సంఖ్య     7,83,132కి చేరుకుంది. తాజాగా పశ్చిమగోదావరిలో 575 మంది కరోనా బారినపడగా.. కృష్ణాలో 503, గుంటూరులో 496, తూర్పుగోదావరిలో 481, చిత్తూరులో 458 కేసులు వెలుగులోకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 7,40,229కి పెరిగాయి. గత 24 గంటల్లో  23 మంది కరోనాతో మరణించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురేసి చొప్పున చనిపోగా.. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, కడప, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాలు 6,429కి పెరిగాయి. 


పశ్చిమలో వైరస్‌ ఉధృతి

పశ్చిమగోదావరి జిల్లాలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆదివారం ఈ జిల్లాలో మరో 575 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 86,138కి చేరుకుంది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 481కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 481 కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 1,10,092కి చేరింది. తాజాగా ఇద్దరు మృతిచెందడంతో కరోనా మరణాలు 586కి పెరిగాయి. చిత్తూరు జిల్లాలో మరో 458 మందికి కరోనా సోకింది. మొత్తం పాజిటివ్‌లు 76,317కి చేరుకున్నాయి. మరో నలుగురు మృతితో మరణాల సంఖ్య 741కి చేరింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 503 కేసులు నమోదవగా మరో నలుగురు చనిపోయారు. మొత్తం పాజిటివ్‌లు 34,598కి, మరణాలు 524కి పెరిగాయి. గుంటూరు జిల్లాలో మరో 496 మందికి కరోనా వైరస్‌ సోకగా.. నలుగురు చనిపోయారు. నెల్లూరు జిల్లాలో తాజాగా 196, కడప జిల్లాలో 266 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో 55, అనంతపురం జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో తాజాగా 218 కేసులు నమోదవగా.. శ్రీకాకుళం జిల్లాలో 168 మంది కరోనా బారినపడ్డారు. విజయనగరం జిల్లాలో 82 కేసులు బయటపడ్డాయి. 

Updated Date - 2020-10-19T09:17:29+05:30 IST