విజయవాడలో 25 రైతు బజార్లు

ABN , First Publish Date - 2020-03-27T14:18:09+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

విజయవాడలో 25 రైతు బజార్లు

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. విజయవాడలో రైతు బజారుకు వస్తున్న జనం గుమిగూడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో 25 రైతు బజార్లుగా ఏర్పాటు చేశారు. ఎక్కడి ప్రజలు అక్కడ కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. సాధ్యమైనంతవరకు తక్కువ సంఖ్యలో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. నిన్న, మొన్నటితో పోలిస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పవచ్చు. కొనుగోలు దారులు సామాజిక దూరం పాటిస్తున్నారు. అధికారులు కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అందరూ మాస్క్‌లు ధరించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.


మరోవైపు నిత్యావసర వస్తువుల డోర్ డెలివరీ చేయడానికి  12 సూపర్ బజార్లు ముందుకొచ్చాయి. ఫోన్‌లో ఆర్డర్ ఇస్తే ఎమ్మార్పీ ధరలకే ఇంటికి సరఫరా చేస్తామని  కమిషనర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. బిగ్ బజార్- 96767 86802, 70362 74053, రిలయన్స్ మార్ట్, చుట్టుగుంట- 89780 40004, స్పెన్సర్స్ రింగ్ రోడ్- 90002 34758, రిలయన్స్ ఫ్రెష్ ఎం.జీ.రోడ్- 97049 99041, వన్ టౌన్- 63058 00028, సూర్యారావుపేట- 73373 28033, మెట్రో- 77997 94872 (ఓన్లీ కార్డు హోల్డర్స్), మోడరన్ సూపర్ బజార్- 77997 39000, 77996 98786, 77997 38000, అమరావతి సూపర్ మార్కెట్- 91216 80084, రిలయన్స్ మార్కెట్- 0866-6679888, 97052 31344, బిగ్ బాస్కెట్ (యాప్)- 93986 52199, 99898 88333, డీ మార్ట్ - 0866-2434674, 88857 60407, గ్రాండ్ మోడరన్ - 97012 46155, రిలయన్స్ స్మార్ట్- 800857 9698


Updated Date - 2020-03-27T14:18:09+05:30 IST