ఏపీలో ఎంటీఎఫ్ బకాయిలు విడుదలకాక విద్యార్థుల ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-11-26T19:38:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎంటీఎఫ్ బకాయిలు విడుదలకాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీలో ఎంటీఎఫ్ బకాయిలు విడుదలకాక విద్యార్థుల ఇబ్బందులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంటీఎఫ్ బకాయిలు విడుదలకాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలపై ప్రభుత్వం నోరు మెదపడంలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఎంటీఎఫ్, ఈ-పాస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.


ఏపీలో 25 లక్షల మంది విద్యార్థులు మెయింటినెన్స్ ఫీజు బకాయిలు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువులకు అవసరమైన పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ చేయడంతోపాటు మెయింటినెన్స్ ఫీజులను సయితం పక్కాగా చెల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం బకాయిలపై నోరు మెదపడంలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాంఘీక సంక్షేమశాఖ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో 5 నెలల కాలానికి సంబంధించి దాదాపు రూ. 500 కోట్లు ఎంటీఎఫ్ బకాయిలు ఉన్నాయి. మరో రూ. 50 కోట్ల వరకు ఈ-పాస్ బకాయిలు పేరుకుపోయాయి. ఏడాదిన్నర కాలంగా ఈ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో జమచేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-11-26T19:38:18+05:30 IST