290కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టివేత

ABN , First Publish Date - 2021-12-02T05:16:21+05:30 IST

290కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టివేత

290కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టివేత
అధికారులు స్వాధీనం చేసుకున్న క్లోరల్‌ హైడ్రేట్‌ బస్తాలు, చిత్రంలో నిందితులు

బషీరాబాద్‌: ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో 290 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టుబడింది. బషీరాబాద్‌ మండలం మైల్వార్‌ చెక్‌పోస్టు వద్ద బుధవారం ఓ వాహనాన్ని తనిఖీ చేయగా 290కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌(సీహెచ్‌) సంచులు పట్టుబడ్డాయని అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎ.చంద్రయ్య పర్యవేక్షణలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కె.పవన్‌కుమార్‌ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారంతో మైల్వార్‌ చెక్‌పోస్టు వద్ద కారు(సుజుకి ఎర్టిగో) తనిఖీలో 10 బస్తాల్లో 290 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టుబడింది. అధికారులు కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. క్లోరల్‌ హైడ్రేట్‌ను ముంబాయిలో కొనుగోలు చేయగా ట్రాన్స్‌పోర్టులో కర్ణాటకలోని గుల్బార్గాకు చేరుకుందని అక్కడ నుంచి కారులో బషీరాబాద్‌, గుల్బార్గా ప్రాంతాల్లో ఒక్కో బస్తాను రూ.50వే లకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. పట్టుబడిన సీహెచ్‌ విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు. సీహెచ్‌ తరలిస్తున్న వారు కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకాకు చెందిన కలాల్‌ రాములు, శివలింగప్పలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకుని తాండూరు ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు ఆర్‌.తుక్యానాయక్‌, పి.శ్రీధర్‌, విష్ణుగౌడ్‌, సిబ్బంది కిషన్‌రావు, సుధాకర్‌, ప్రవీణకుమార్‌గౌడ్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T05:16:21+05:30 IST