Abn logo
Oct 23 2021 @ 02:36AM

ఏడేళ్లలో 32 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

  • 15 రోజుల్లోనే వ్యాపార అనుమతులు ఇస్తున్నాం: కేటీఆర్‌ 


తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో రాష్ట్రం 32 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా 8వ జాతీయ సదస్సు శుక్రవారం వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల్లో 24 శాతం మంది ఇక్కడే వ్యాపార విస్తరణ చేపట్టారని, రాష్ట్రంలోని వ్యాపార అనుకూల విధానాలు దీనికి కారణమన్నారు. టీఎ్‌సఐపాస్‌ విధానం ద్వారా 15రోజుల్లోనే వ్యాపార అనుమతులు అందిస్తున్నామని, దీంతో పెట్టుబడులకు పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు.