కొత్తగా నాలుగు ఆటలు

ABN , First Publish Date - 2021-07-19T09:22:42+05:30 IST

విశ్వక్రీడల చరిత్రలోనే అతి పెద్దక్రీడలుగా టోక్యో ఒలింపిక్స్‌ రికార్డు సృష్టించబోతున్నది. నాలుగు క్రీడలకు ఈసారి ప్రవేశం కల్పించడంతో టోక్యోలో పతకాలు ప్రదానం చేసే ఈవెంట్ల సంఖ్య 339కి పెరిగింది. నూతనంగా ప్రవేశిస్తున్న ఆ ఆటల వివరాలు..

కొత్తగా నాలుగు ఆటలు

  • ఒలింపిక్స్‌ 4 రోజుల్లో

విశ్వక్రీడల చరిత్రలోనే అతి పెద్దక్రీడలుగా టోక్యో ఒలింపిక్స్‌ రికార్డు సృష్టించబోతున్నది. నాలుగు క్రీడలకు ఈసారి ప్రవేశం కల్పించడంతో టోక్యోలో పతకాలు ప్రదానం చేసే ఈవెంట్ల సంఖ్య 339కి పెరిగింది. నూతనంగా ప్రవేశిస్తున్న ఆ ఆటల వివరాలు.. 


ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం


సర్ఫింగ్‌ 

ఉవ్వెత్తున ఎగసే అలల మధ్య సాగే సాహస క్రీడ సర్ఫింగ్‌. పురుషులు, మహిళల విభాగాలలో పోటీలు ప్రీలిమినరీ హీట్స్‌, హెడ్‌ టు హెడ్‌ నాకౌట్‌ రౌండ్‌లలో నిర్వహిస్తారు. సర్ఫర్ల నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని విజేతను ఎంపిక చేస్తారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడను చేర్చారు. 





స్పోర్ట్‌ క్లైంబింగ్‌

రాక్‌ క్టైంబింగ్‌లాంటి క్రీడ ఇది. స్పీడ్‌, బౌల్డరింగ్‌, లీడ్‌ అనే మూడు విభాగాల సమాహారంగా ఈ పోటీ జరుగుతుంది. మూడు విభాగాలలో ఆధిక్యం కనబరిచిన వారిని పురుషులు, మహిళల్లో విజేతలుగా నిర్ధారిస్తారు. పారిస్‌ క్రీడల్లోనూ ఇది కొనసాగనుంది. 





కరాటే

సంప్రదాయ ఆత్మరక్షణ క్రీడ కరాటే 1868లో జపాన్‌లోనే పుట్టింది. కటా, కుమిటే విభాగాలుగా పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళలల్లో మూడు వెయిట్‌ కేటగిరీలలో పోటీలుంటాయి. అయితే 2024 ఒలింపిక్స్‌లో కరాటేను కొనసాగించడంలేదు. ఇక..గతంలో ఒలింపిక్స్‌లో పతక క్రీడగా ఉండి తర్వాత ఉపసంహరించిన బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌ టోక్యో గేమ్స్‌లో పునరాగమనం చేస్తున్నాయి. అయితే ఈ ఒక్క క్రీడలకే ఇవి పరిమితం కానున్నాయి. 




స్కేట్‌బోర్డింగ్‌

అమెరికాలో పుట్టిన ఈ క్రీడలో విన్యాసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. అందుకే దీనిని ‘యాక్షన్‌ స్పోర్ట్‌’ అని పిలుస్తారు. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడను కొనసాగించనున్నారు. పార్క్‌, స్ట్రీట్‌ అనే రెండు విభాగాల్లో పతకాలు ప్రదానం చేస్తారు. పార్క్‌ విభాగంలో..డోమ్‌లా ఉండే స్టేడియంలో స్కేటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. స్ట్రీట్‌ కేటగిరిలో..మెట్లు, రెయిలింగ్‌మీదనుంచి స్కేట్‌బోర్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో స్కేటర్ల నైపుణ్యాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. 

Updated Date - 2021-07-19T09:22:42+05:30 IST