ఇక 6000 ట్రెండ్‌ మొదలైపోయింది!

ABN , First Publish Date - 2020-02-12T23:19:47+05:30 IST

మొబైల్‌ బ్యాటరీ ఎనర్జీ కెపాసిటీని mah( మిల్లీయాంప్‌ అవర్స్‌ ) లో కొలుస్తారు. చాలాకాలంవరకూ ఈ బ్యాటరీ కెపాసిటీ విషయంలో 3600 maH అనేది ఒక స్టాండర్డ్‌ గా ఉండేది.

ఇక 6000 ట్రెండ్‌ మొదలైపోయింది!

మొబైల్‌ బ్యాటరీ ఎనర్జీ కెపాసిటీని mah( మిల్లీయాంప్‌ అవర్స్‌ ) లో కొలుస్తారు. చాలాకాలంవరకూ ఈ బ్యాటరీ కెపాసిటీ విషయంలో 3600 maH అనేది ఒక స్టాండర్డ్‌ గా ఉండేది. ఆ తరవాత నెమ్మదిగా వివిధ కంపెనీలు ఈ బ్యాటరీ కెపాసిటీని 4000 maH చేశాయి. ప్రస్తుతం ఏ హై-ఎండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ అయినా కనీసం 4000 maH లేనిదే హై-ఎండ్‌ అనిపించుకోదు. అయితే రెండున్నరేళ్ల క్రిందట వచ్చిన షియామీ మీ మ్యాక్స్‌ 2 - తొలిసారిగా ఐదువేలు దాటి ఏకంగా 5300 maH బ్యాటరీతో వచ్చింది. షియామీ మీ మ్యాక్స్‌ రిలీజ్‌ అయింది 2017 లో! అయినప్పటికీ 2018,2019 సంవత్సరాల్లో రిలీజయిన అనేక ఫోన్లు ఈ బ్యాటరీ కెపాసిటీని స్టాండర్డ్‌ చేసుకోలేదు. ఎంత గొప్ప స్మార్ట్‌ ఫోన్‌ అయినా 4000maH, 4300maH వరకే పరిమితమవుతూ వచ్చింది. కేవలం Samsung Galaxy S20 లాంటి కొన్ని హై-ఎండ్‌ ఫోన్లు మాత్రమే 5000maH టచ్‌ చేశాయి. అయితే 5760 mAh, 5810 mAh లాంటి భిన్నభిన్నమైన కెపాసిటీలు కలిగిన ఫోన్లను షియామీ రిలీజ్‌ చేసింది.


అయితే ఇప్పుడు కాలం మారింది. 2020 అడుగుపెట్టేనాటికి కొన్ని స్మార్ట్‌ ఫోన్లు నేరుగా 6000 maH కెపాసిటీ కలిగిన బ్యాటరీని అందించడం ప్రారంభించాయి. వీటిలో గెలాక్సీ M సీరీస్‌ ఫోన్లని ముఖ్యంగా చెప్పుకోవాలి. తాజాగా రిలీజయిన శామ్‌సంగ్‌ గెలాక్సీ M31 ఈ బ్యాటరీనే తన ఫోన్లో ముఖ్యమైన ఫీచర్‌గా ప్రమోట్‌ చేస్తోంది. ఇక 2020 లో రానున్న అనేక స్మార్ట్‌ఫోన్లు డిఫాల్ట్‌గా 6000 maH కెపాసిటీ ఉంటాయని ఊహించవచ్చు.


స్మార్ట్‌ఫోన్లను జనం నిరంతరాయంగా వాడుతున్న ఈ కాలంలో బ్యాటరీ అత్యంత ముఖ్యమైన అంశం. చీటికీ మాటికీ పవర్‌ బ్యాంక్‌తో పని లేకుండా ఎక్కువ కెపాసిటీ ఉన్న ఫోన్‌ కలిగి ఉండడం నిజంగా సౌకర్యవంతమే కదా?

Updated Date - 2020-02-12T23:19:47+05:30 IST