అమెరికాలో 30 ఏళ్లు పైబడిన వారిలో 70శాతం మందికి అందిన వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-06-23T08:50:38+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జూలై నాలుగున అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశంలోని పెద్ద వాళ్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని బైడెన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అమెరికాలో 30 ఏళ్లు పైబడిన వారిలో 70శాతం మందికి అందిన వ్యాక్సిన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జూలై నాలుగున అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశంలోని పెద్ద వాళ్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని బైడెన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అమెరికాలో 30ఏళ్లు పైబడిన వారిలో 70శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా అందినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. కొత్త లెక్కల ప్రకారం, జూలై 4 నాటికి దేశంలో 27 ఏళ్లు నిండిన వారిలో 70శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అదే సమయంలో 18 నుంచి 26 సంవత్సరాల వయసున్న యువకులకు వ్యాక్సిన్ అందించడంపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోందని వైట్ హౌస్ అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2021-06-23T08:50:38+05:30 IST