శోకసంద్రంలో జస్వీందర్ సింగ్ కుటుంబం

ABN , First Publish Date - 2021-04-18T02:13:04+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో గురువారం జరిగిన కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన 70ఏళ్ల జస్వీందర్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. జస్వీందర్ సింగ్ మరణవార్తను విని.. అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయా

శోకసంద్రంలో జస్వీందర్ సింగ్ కుటుంబం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గురువారం జరిగిన కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన 70ఏళ్ల జస్వీందర్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. జస్వీందర్ సింగ్ మరణవార్తను విని.. అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితమే జస్వీందర్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడినట్టు చెబుతూ.. అతని చిన్న కుమారుడు జతిందర్ సింగ్ కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాకుండా తన అన్న కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డట్టు జతిందర్ సింగ్ చెప్పారు. ఈ క్రమంలోనే తన తండ్రి జస్వీందర్ సింగ్ కూడా ఎనిమిదేళ్ల క్రితం పంజాబ్ నుంచి అమెరికాకు వెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ మధ్యే తన తండ్రి జస్వీందర్ సింగ్.. ‘ఫెడెక్స్’ కొరియర్ సంస్థలో ఓ పనికి కుదిరినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పేమెంట్ తీసుకునేందుకు తన తండ్రి గురువారం రోజు అక్కడికి వెళ్లగా.. కాల్పులు చోటు చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. తన తండ్రి మృతదేహం ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నట్లు చెప్పారు. 


కాగా.. అమెరికాలోని ఇండియానా పోలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ‘ఫెడెక్స్‌’ కొరియర్‌ సంస్థలో గురువారం జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు భారతీయ అమెరికన్లు ఉన్నట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. నలుగురు కూడా సిక్కులేనని అధికారులు తెలిపారు. మృతులను అమర్జీత్ జోహల్(66), జస్వీందర్ కౌర్(64), జస్వీందర్ సింగ్(70), అమర్జీత్ స్కోహన్(48)గా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-04-18T02:13:04+05:30 IST