మైక్రో చిప్‌ తయారీ కంపెనీలకు 7500 కోట్లు

ABN , First Publish Date - 2021-04-01T06:14:15+05:30 IST

మొబైల్‌ ఫోన్లు, లాప్‌టా్‌పలు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఆటోమొబైల్‌ కంపెనీలు ప్రస్తుతం చిప్స్‌ (సెమీకండక్టర్లు) కొరతతో అల్లాడిపోతున్నా

మైక్రో చిప్‌ తయారీ కంపెనీలకు 7500 కోట్లు

దేశీయంగా చిప్‌ల తయారీకి చేయూత

 ఒక్కో కంపెనీకి 100 కోట్ల డాలర్ల సహాయం

కొత్త విధానానికి ప్రభుత్వం కసరత్తు


మొబైల్‌ ఫోన్లు, లాప్‌టా్‌పలు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఆటోమొబైల్‌ కంపెనీలు ప్రస్తుతం చిప్స్‌ (సెమీకండక్టర్లు) కొరతతో అల్లాడిపోతున్నాయి. ఒక వేళ దొరికినా అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. వీటి కొరతతో ప్రస్తుతం దేశంలో దాదాపు లక్ష కార్ల డెలివరీలు ఆలస్యమవుతున్నట్టు అంచనా. చిప్స్‌ కొరత కారణంగా కార్ల కంపెనీలు గురువారం నుంచి ధరలు పెంచేశాయి. 


ఈ చిప్స్‌ కొరత తీరాలంటే దేశంలో వాటి తయారీ ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించిన  ప్రభు త్వం చిప్స్‌ తయారీ ప్లాంట్‌ పెట్టే ఒక్కో కంపెనీకి వంద కోట్ల డాలర్ల (రూ.7500 కోట్లు) మేరకు  నగ దు ప్రోత్సాహకాలు అందించాలని యోచిస్తోంది. ఈ విధానానికి తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఈ విధానం గనుక అమలుపరిచినట్టయితే చిప్స్‌ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి కంపెనీలైన శాంసంగ్‌, తైవాన్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ (టీఎ్‌సఎంసీ) ప్లాంట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపవచ్చునని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 


పెరిగిన డిమాండ్‌: కొవిడ్‌ బారి నుంచి ఆర్థిక వ్యవస్థ బయట పడడంతో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, వాహనాలకు గిరాకీ పెరిగింది. ఇంటి నుంచే పని పుణ్యమాని ల్యాప్‌టా్‌పలకు మరింత డిమాండ్‌ ఏర్పడింది. కొవిడ్‌ భయంతో ప్రజా రవాణాకు దూరంగా ఉంటున్న వారు తమ బడ్జెట్‌కు తగ్గట్టు ఏదో ఒక కారు బుక్‌ చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చిప్స్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఈ వస్తువులన్నింటికీ చిప్స్‌ కీలకం.ఈ ఆధునిక ఎలకా్ట్రనిక్‌ వస్తువుల్లో చిప్స్‌ మెదడు లాంటి వి.. ప్రస్తుతం వీటిని టీఎ్‌సఎంసీ, శామ్‌సంగ్‌ కంపెనీలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. డిమాండ్‌ అనూహ్యంగా పెరగడంతో ఈ కంపెనీలు చేతులెత్తేశాయి. సరఫరా చేసే చిప్స్‌ ధరలు భారీగా పెంచేశాయి. 



దేశీయ తయారీపై దృష్టి : చిప్స్‌ తయారీ అత్యంత అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పని. పెట్టుబడులు కూడా ఎక్కువే. ఒక్కో యూనిట్‌ పెట్టేందుకు ఎంత లేదన్నా 500 నుంచి 700 కోట్ల డాలర్లు అవసరం. మళ్లీ ఇందులో పని చేసేందుకు మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు కావాలి. ఈ కొరతతో అమెరికా, యూరప్‌, చైనా దేశాలు తమ దేశాల్లోనే చిప్‌ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చేందుకూ సిద్ధమయ్యాయి. ఈ రాయితీలతో శాంసంగ్‌, టీఎ్‌సఎంసీ రెండూ అమెరికాలో రెండు పెద్ద చిప్‌ తయా రీ యూనిట్లు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. 

Updated Date - 2021-04-01T06:14:15+05:30 IST