సతతం.. హరితం

ABN , First Publish Date - 2021-06-12T05:41:09+05:30 IST

సతతం.. హరితం

సతతం.. హరితం
మహబూబాబాద్‌ మండలం అమనగల్‌ నర్సరీని పరిశీలిస్తున్న ఎంపీడీవో రవీందర్‌

ఏడో విడత హరితహారానికి అంతా రెడీ

జిల్లా టార్గెట్‌ 69.58 లక్షల మొక్కలు 

16 మండలాల్లో నాటడానికి ప్రణాళిక సిద్ధం

19 శాఖలకు మొక్కల కేటాయింపు 

అత్యధికంగా డీఆర్‌డీవోకు 43.77 లక్షల మొక్కలు


మహబూబాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారం చుట్టింది. స్వరాష్ట్రం సిద్దిం చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హరితహారం పథకాన్ని తీసుకువచ్చి హరి తతెలంగాణ కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతియేట జిల్లాల వారీగా లక్ష్యాలను పెట్టి మొక్క లు నాటే విధంగా పక్కా ప్రణాళికలు రూపొందించి లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలో జూన్‌ మాసం నుంచి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పల్లెపల్లెన మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలను గ్రామపంచా యతీ పాలకమండళ్లతో పాటు సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో అడవుల శాతం తగ్గి సకాలంలో వర్షాలు కురియకపోవడంతో వ్యవసాయ భూములు బీడు భూములుగా మారుతున్న త రుణంలో ఆరేళ్లుగా హరితహారానికి అధిక నిధులు కేటాయి స్తూ మొక్కలు నాటుతూ... అడవుల శాతాన్ని పెంచుతున్నా రు. ఈ తరుణంలో అడవుల శాతం కొద్దీమేర పెరిగడంతో హరితహారం లక్ష్యసాధన సఫలీకృతమవుతోందని చెప్పవచ్చు. 


ఏడో హరితహారానికి ప్రణాళికలు..

జిల్లాలో ఏడో హరితహారం ప్రారంభించేందుకు అధికా రులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 69.58 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని పెట్టారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధ్యక్షతన సంబంధిత శాఖ అధికారులు సమావేశ మై హరితహారం విజయవంతం కోసం క్షుణంగా చర్చించా రు. శాఖల వారీగా ఎన్ని మొక్కలు నాటాలనే లక్ష్యాలను కే టాయించారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొం దించుకుని హరితహారం విజయవంతానికి సిద్ధంగా ఉండా లని సూచించారు. ఇప్పటికే జిల్లాలోని 461 గ్రామపంచాయ తీల పరిధిల్లో నర్సరీల్లో 80 లక్షల మొక్కలను పెంచి నా టేందుకు సిద్ధం చేశారు. నర్సరీల్లో కానుగ, యాప, చింత, జామ, కర్జూర, టేకు, మామిడి, నిమ్మ, బత్తాయిలతో పాటు ఇండ్లలో నాటేందుకు పూల మొక్కలను కూడా పెంచారు. అవెన్యూ ప్లాంటేషన్‌, ఇళ్లలో మొక్కలు నాటేందుకు, రోడ్ల వెంట, ఎస్సారెస్పీ కాలువల వెంట మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తం కావాలని అధికారులకు సూచిస్తున్నారు. 


19 శాఖలకు హరిత కేటాయింపులు..

జిల్లాలోని 16 మండలాల పరిధిలో 461 గ్రామపంచాయ తీలతో పాటు మునిసిపాలిటీలైన మానుకోట, మరిపెడ, తొ ర్రూరు, డోర్నకల్‌లలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. వర్షాల ఆరంభం కావడంతో హరితహారంను ప్రారంభించేందుకు సన్నద్దమ వుతున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధం గా ఉంచాలని సూచిస్తున్నారు. అందులో భాగంగానే 19 శా ఖలకు హరితలక్ష్యాలను కేటాయించారు. ఏ శాఖ ఎన్నెన్ని మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని వారీకి అప్పగించారు. అన్ని శాఖల అధికా రులతో సమన్వయ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి హరితహారం విజయవంతం కోసం దిశానిర్ధేశం కూడా చేశారు. కాగా, ప్రతియేట ప్రజల భాగస్వామ్యంతోనే హరి తహారం విజయవంతమవుతోందని, ఈ ఏడాది కూడా అధికారులు హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

Updated Date - 2021-06-12T05:41:09+05:30 IST