చిన్నారిపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-04-22T05:43:22+05:30 IST

చిన్నారిపై అఘాయిత్యం

చిన్నారిపై అఘాయిత్యం

వాజేడు, ఏప్రిల్‌ 21 : జిల్లాలోని వాజేడు మండలంలోని ఓ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కిరాణా షాపు వద్దకు మిక్చర్‌ కొనుక్కునేందుకు వెళ్లిన చిన్నారిని షాపు యజమాని కుమ్మరి సంజీవరావు(23) బాలికను షాపు వెనక్కి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కూతురు ఎంత సేపటికీ  రాకపో వడంతో షాపు దగ్గరకు వచ్చిన తల్లి బాలికపై జరుగుతున్న లైంగిక దాడిని చూసింది. నిర్ఘాంతపోయిన ఆమె ఆ యువకుడిని నిలదీయగా అతడు  ఘర్షణకు దిగాడు. బాలిక తల్లిదండ్రులు వెంటనే పేరూరు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై బండి హరికృష్ణ తెలిపారు. 


Updated Date - 2021-04-22T05:43:22+05:30 IST