హైదరాబాద్‌లో ప్రొవిడెన్స్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2020-02-28T07:19:13+05:30 IST

అమెరికా హెల్త్‌కేర్‌ సిస్టమ్స్‌, సర్వీసెస్‌ కంపెనీ ప్రొవిడెన్స్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బిగ్‌ డేటా, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌లెర్నింగ్‌, ఒరకిల్‌ క్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌ అజూరే వంటి...

హైదరాబాద్‌లో ప్రొవిడెన్స్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికా హెల్త్‌కేర్‌ సిస్టమ్స్‌, సర్వీసెస్‌ కంపెనీ ప్రొవిడెన్స్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బిగ్‌ డేటా, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌లెర్నింగ్‌, ఒరకిల్‌ క్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌ అజూరే వంటి డిజిటల్‌ టెక్నాలజీలను వినియోగించి హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ కేంద్రంలో కొత్త ఉత్పత్తులు, సొల్యూషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రొవిడెన్స్‌ కంట్రీ మేనేజర్‌ మురళీ కృష్ణ తెలిపారు. ఏడాదిలో 350 మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఈ కేంద్రంలో పనిచేయగలరని, వచ్చే రెండు, మూడేళ్లలో నిపుణుల సంఖ్యను 2,000 మందికి పెంచుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-02-28T07:19:13+05:30 IST