కొత్త రకం విద్యుత్‌ చోరీ

ABN , First Publish Date - 2020-06-04T09:26:56+05:30 IST

కొత్త రకంలో విద్యుత్‌ చోరీ చేస్తున్నట్లు విద్యుత్‌ వినియోగిస్తూ కమర్షియల్‌ (ఫేస్‌-2) మీటర్‌ నుంచి ఇంటి నిర్మాణాన్ని

కొత్త రకం విద్యుత్‌ చోరీ

విద్యానగర్‌ కాలనీలో ఫేస్‌-2 నుంచి వినియోగం : 

టెంపరరీ సంపులకు మార్చి మాల్‌ ప్రాక్టీస్‌

విచారణ చేపట్టిన రూ.6వేలు జరిమానా విధించిన ఏడీఈ భాస్కర్‌రావు


చుంచుపల్లి, జూన్‌ 3 : కొత్త రకంలో విద్యుత్‌ చోరీ చేస్తున్నట్లు విద్యుత్‌ వినియోగిస్తూ కమర్షియల్‌ (ఫేస్‌-2) మీటర్‌ నుంచి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న సంఘటన విద్యానగర్‌ కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్‌ కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్‌ కాలనీ నిర్మిస్తున్న ఇంటి నిర్మాణానికి నీటి కొరకు పక్కనే గల ఇంట్లో కమర్షియల్‌ మీటర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలోనే నీటి మోటారును సైతం విద్యుత్‌ స్తంభానికి అనుసంధానం చేసే స్టేజ్‌ వైర్‌కు తాళం వేసి కట్టడంతో ప్రమాదం పొంచి ఉన్నదని వాదన బలంగా వినబడుతోంది.


ఈ సంఘటన ప్రాంతంలో కాంక్రీట్‌ పనులు జరుగుతుండటంతో విద్యుత్‌ మీటర్‌ లేకుండా పనులు జరుగుతుండటం గమనార్హం. ఈ సమాచారాన్ని తెలుసుకున్న కొత్తగూడెం ఎన్‌పీడీసీఎల్‌ ఏడీఈ భాస్కర్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇంటి పక్కన ఇంట్లో విద్యుత్‌ మీటర్‌ ఫేస్‌-2 నుంచి సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అనుమతి లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం టెంపరరీ సంపులకు మార్చి మాల్‌ ప్రాక్టీస్‌ కింద రూ.6వేలు జరిమానా విధించారు. కొత్త విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంజూరు చేస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు చేస్తే విద్యుత్‌ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఏడీఏ సూచించారు. 

Updated Date - 2020-06-04T09:26:56+05:30 IST