Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలూ బోండా

కావలసిన పదార్థాలు: శనగపిండి- రెండు కప్పులు, ఆలు- 4, బియ్యం పిండి- రెండు కప్పులు, ఆవాలు- ఓ స్పూను, ఇంగువ- కొంచెం, కొత్తిమీర- ఓ కట్ట, పచ్చిమిర్చి- పది, అల్లం ముక్క- చిన్నది, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె, ఉప్పు, తగినంత.


తయారుచేసే విధానం: బియ్యం పిండి, శనగ పిండి ఉప్పు వేసి నీటిలో జారుగా కలుపుకోవాలి. పచ్చిమర్చి, కొత్తిమీర, కరివేపాకును చిన్నగా కత్తిరించుకోవాలి. బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి ముద్దగా చేయాలి. దీనికి ఆవాలు, అల్లం, పచ్చిమర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. ఒక్కో ముద్దను బియ్యంపిండి మిశ్రమంలో అద్ది నూనెలో వేయించి దోరగా కాగాక తీస్తే అలూ బోండా రెడీ.

పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని