అమరావతి: అబ్దుల్ సలాం కేసు సీబీఐకి అప్పగించాలని మండలిలో టీడీపీ ఆందోళన చేపట్టింది. ఆందోళనలో టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సలాం కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. సలాం కేసును సీబీఐతో విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.