అభిమన్‌ విడుదల కోసం ఉద్యమించాలి: అభయ్‌

ABN , First Publish Date - 2021-08-20T00:54:46+05:30 IST

పెరు దేశ విప్లవనేత అభిమన్‌ గుజమన్‌(గొంజాలో)ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి

అభిమన్‌ విడుదల కోసం ఉద్యమించాలి: అభయ్‌

వరంగల్: పెరు దేశ విప్లవనేత అభిమన్‌ గుజమన్‌(గొంజాలో)ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ మీడియాకు లేఖను విడుదల చేశారు. పెరూ దేశంలో విప్లవ నేతగా అభిమన్‌ సుప్రసిద్ధుడని, మావో సిద్ధాంతం వెలుగులోకి తెచ్చి ప్రజల రాజ్యాధికారం కోసం ఆ దేశంలో ప్రజాయుద్ధాన్ని వేగంగా వ్యాప్తి చేశాడని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని పెరు దేశ పరిస్థితులకు అన్వయిస్తూ, తాత్విక, సైనిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. పెరు దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికి అనుకూలమైన పరిస్థితులు పరిపక్వమవుతుండడంతో బెంబేలెత్తిన అమెరికా సామ్రాజ్యవాదులు, వారి తొత్తులైన దేశ దోపిడీ పాలకవర్గాలు విప్లవోద్యమంపై ఉక్కుపాదం మోపారని  అభయ్ పేర్కొన్నారు

Updated Date - 2021-08-20T00:54:46+05:30 IST