Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆంధ్రా వద్దు - ఒడిశా ముద్దు కథనంపై కదిలిన ఐటీడీఏ యంత్రాంగం

 విజయనగరం: ఆంధ్రా వద్దు - ఒడిశా ముద్దు కథనంపై ఐటీడీఏ యంత్రాంగంలో కదిలిక వచ్చింది. ఆంధ్రాపై ఒరిస్సా నేతలు కన్నేసిన గ్రామాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో విజయనగరం జిల్లాకు చెందిన సరిహద్దు గిరిజన గ్రామాల్లో పీవో, ఐఎఎస్ అధికారి కూర్మనాథ్ సారథ్యంలో అధికారుల బృందం పర్యటించింది.  రెండు రోజుల్లో రోడ్డు పనులు, గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని గిరిజనులకు అధికారులు హామీ ఇచ్చారు. ఒడిశా మాయలో పడొద్దని గిరిజనులకు అధికారులు సూచించారు. తమ ప్రాంత సమస్యలపై వార్తా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గిరిజనులు కృతజ్ఙతలు తెలిపారు. 


Advertisement
Advertisement