అప్పుల్లో ఉన్నవారికి ఒక ఐడియా..

ABN , First Publish Date - 2021-04-02T18:23:57+05:30 IST

కరోనా సంక్షోభం కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఇటీవల పుట్టుకొచ్చిన...

అప్పుల్లో ఉన్నవారికి ఒక ఐడియా..

హైదరాబాద్ : కరోనా సంక్షోభం కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఇటీవల పుట్టుకొచ్చిన రుణ యాప్‌లు కొంతమందిని పూర్తిగా అప్పుల వలలోకి లాగేశాయి. మరి ఈ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఆ రుణ ఉచ్చులోంచి బయటకు వచ్చేందుకు ఈ సూత్రం పాటించండి. అధిక వడ్డీ ఉన్న అప్పులను వేగంగా వదిలించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. తొలుత వడ్డీ రేట్ల ఆధారంగా రుణాలను ఎక్కువ నుంచి తక్కువకు రాస్తూ ఓ జాబితాను సిద్ధం చేసుకోవాలి. బ్యాంకులు, సంస్థలు నిర్దేశించిన కనీస మొత్తాన్ని అన్ని రుణాల్లోనూ చెల్లించాలి. మిగిలిన అదనపు సొమ్మను అత్యధిక వడ్డీరేటు ఉన్న రుణాన్ని ముందుగా చెల్లించేందుకు వినియోగించాలి. అలా ఎక్కువ వడ్డీ ఉన్న రుణ భారం తొలిగే వరకు చేయాలి.


సాధారణంగా క్రెడిట్ కార్డుపై వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ముందు దీని నుంచి బయడపడాలి. తర్వాత వ్యక్తి గత రుణాలు, వినియోగ ఆధారిత వస్తువులపై తీసుకున్న రుణాలు.. ఇలా ఒకదానితర్వాత ఒకదాన్ని జాబితా నుంచి తొలగించుకుంటూ వెళ్లాలి. దీనివల్ల వడ్డీ వ్యయం తగ్గడంతోపాటు రుణాలు త్వరగా చెల్లించే అవకాశం ఏర్పడుతుంది. వడ్డీరేటుతో సంబంధం లేకుండా రుణ మొత్తాన్ని తక్కువ నుంచి ఎక్కువకు జాబితా చేసుకోవాలి. అన్నిటికి కనీస మొత్తం చెల్లించాలి. మిగిలిన సొమ్మును తక్కువ మొత్తం ఉన్న రుణానికి కేటాయించాలి. ఇలా ఒక్కొక్క రుణాన్ని జాబితా నుంచి క్రమంగా తొలగించుకుంటూ పోవాలి. నిజానికి ఈ పద్ధతి రుణ ఊబిలో చిక్కుకుపోయిన వ్యక్తుల మానసిక స్థితిని చాలా శాంతపరుస్తుంది. ఒక్కొక్కటిగా తొలగిపోతుంటే మనసు కుదుటపడుతుంది. రుణ ఉచ్చునుంచి బయటపడాలన్న ఆలోచనే పెద్ద ముందడుగు.

Updated Date - 2021-04-02T18:23:57+05:30 IST