ABN ఎఫెక్ట్‌: వనమా రాఘవ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-06T21:29:14+05:30 IST

ఎట్టకేలకు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABN ఎఫెక్ట్‌: వనమా రాఘవ అరెస్ట్‌

హైదరాబాద్: ఎట్టకేలకు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాఘవను పోలీసులు కొత్తగూడెంకు తరలిస్తున్నారు. వనమా వ్యవహారంపై ఏబీఎన్ వరస కథనాలను ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ నిందితుడిగా ఉన్నారు. రాఘవ ఆకృత్యాలపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతానని చెప్పారు.

Updated Date - 2022-01-06T21:29:14+05:30 IST