నారింజ కాయల పులేరం...

ABN , First Publish Date - 2020-01-15T20:19:48+05:30 IST

ఆరు పుల్లటి నారింజ కాయలు పట్టుకెళ్లి మా అమ్మకిస్తే... ఒకో కాయనీ రెండు పెచ్చులుగా కోసి రసం తీసి, ఒక గిన్నెలో పోసేక అందులోంచి కొంత రసం ఇంకో గిన్నెలోకి పోసి...అడ్డంగా కోసిన గుప్పెడు పచ్చిమిరపకాయల్ని ఉప్పేసి ఆ రసంలో రోజంతా నానబెట్టేది. దీంతో పచ్చటి మిరపకాయలు బంగారు రంగులోకి మారిపోయేవి.

మర్నాడు, వండిన సోలెడు బియ్యం అన్నంలో పసుపూ, ఉప్పూ కలిపేది. ఎక్కువ పచ్చి శనగపప్పు వేసి పెట్టిన పోపుని, ఊరిన పచ్చిమిరపకాయల్ని, కిటికీ గూట్లో దాచిన మిగతా నారింజరసాన్నీ ఆ పసుపు అన్నంలో వేసి బాగా కలిపితే తయారయిపోయేది.. నారింజ కాయల పులిహోర. ఊరిన మిరపకాయల్ని నంజుకుంటూ రెండేసి రోజులు తినేవాళ్లం.
 
ఐతే, పెళ్లయి కాపురానికి బలభద్రపురం వెళ్లిపోయిన మా అక్క అదే నారింజకాయల పులిహోర చేసేది. నా భార్య కూడా చేసేది. ఇంకా మా వాళ్లలో చాలామంది చేసేవారు. కానీ, మా అమ్మచేసిన
పులిహోర రుచి వాళ్లు చేస్తే రాలేదు గాక రాలేదు. అందులో ఏ ప్రేమ కలిపేదో మా అమ్మ...సూరమ్మ.

Updated Date - 2020-01-15T20:19:48+05:30 IST