జీతాలు చెల్లించే బాధ్యతలు రద్దుచేయండి

ABN , First Publish Date - 2020-06-29T10:30:56+05:30 IST

జీతాల చెల్లింపుపై ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దుచేసి, యధాతధంగా ఎంఈవోలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రైమరీ టీచర్స్‌అసోసియేషన్‌ రాష్ట్ర

జీతాలు చెల్లించే బాధ్యతలు రద్దుచేయండి

ఖానాపురంహవేలి, జూన్‌28: జీతాల చెల్లింపుపై  ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దుచేసి, యధాతధంగా ఎంఈవోలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రైమరీ టీచర్స్‌అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ షౌకత్‌అలీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ హసన్‌ అధ్యక్షతన జరిగిన దృశ్యశ్రవణ విధానంలో నిర్వహించిన జిల్లాకార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కత్తి నెహ్రూగౌడ్‌, జయ, రాష్ట్ర కార్యదర్శి ఎం.శివరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నాయకులు మహ్మద్‌ హుస్సేన్‌, ఉమ, చాంద్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-06-29T10:30:56+05:30 IST