ముస్లిమేతరులకు గుడ్ న్యూ్స్ చెప్పిన అబుదాబీ..!

ABN , First Publish Date - 2021-11-09T03:17:40+05:30 IST

అబుదాబీలోని ముస్లిమేతరులకు ఇకపై సివిల్ చట్టం కింద వివాహాలు, విడాకులు, పిల్లల జాయింట్ కస్టడీకీ అనుమతిస్తున్నాట్టు అబుదాబీ అధినేత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.

ముస్లిమేతరులకు గుడ్ న్యూ్స్ చెప్పిన అబుదాబీ..!

ఇంటర్నెట్ డెస్క్: అబుదాబీలోని ముస్లిమేతరులకు ఇకపై సివిల్ చట్టం కింద వివాహాలు, విడాకులు, పిల్లల జాయింట్ కస్టడీకీ అనుమతిస్తున్నాట్టు అబుదాబీ అధినేత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. విడాకుల తరువాత భరణం, పితృత్వ నిరూపణ, వారసత్వం వంటి అంశాలను కూడా సివిల్ చట్టం పరిధిలోకి తెస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచయవనికపై అబుదాబీ ప్రాముఖ్యాన్ని, పేరుప్రఖ్యాతులు ఇనుమడించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ అధినేత పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ ఈ సివిల్ చట్టం రూపొందినట్టు అక్కడి మీడియా వ్యాఖ్యానించింది. కాగా.. మారుతున్న ప్రపంచంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు యూఏఈ మునుపటి తీరుకు భిన్నంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. పెళ్లికి ముందు శృంగారం, మద్యపానం, పరవు హత్యల పట్ల చట్టాల్లోని ఉదాసీనతను తొలగించడం వంటి నిర్ణయాలను కొంత కాలం క్రితం అమలు చేసింది. యూఏఈని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా చట్టాల్లో వరుసగా మార్పులు చేసుకుంటూ వస్తోంది. 


Updated Date - 2021-11-09T03:17:40+05:30 IST