ఏసీబీకి చిక్కిన పాల్వంచ ఎంపీడీవో

ABN , First Publish Date - 2021-04-17T06:15:47+05:30 IST

ఏసీబీకి చిక్కిన పాల్వంచ ఎంపీడీవో

ఏసీబీకి చిక్కిన పాల్వంచ ఎంపీడీవో
పట్టుబడ్డ ఎంపీడీవో ఆల్బర్ట్‌

రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

పాల్వంచ రూరల్‌, ఏప్రిల్‌ 16: శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనుల రెండోవిడత బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్‌ చేసిన పాల్వంచ ఎంపీడీవో ఆల్బర్ట్‌ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కాంట్రాక్టర్‌ నుంచి రూ.20వేలు లంచం తీసు కుం టుం డగా దాడి చేసిన అధికారులు ఆయన్ను రెడ్‌ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారి మధుసూధన్‌ తెలిపిన వివరాల ప్రకారం. పాల్వంచ మండలం పాండు రంగాపురం గ్రామపంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ఆడెపు రామలిం గయ్య కు కాంట్రాక్టు అప్పగించారు. ఆయను పనులు సకాలంలో పూర్తిచేయగా మొదటి విడత బిల్లు మంజూరు లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. రెండో విడత బిల్లు కూడామార్చి 30నవచ్చిందని తెలుసుకున్న కాంట్రాక్టర్‌ రామలింగయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శిని శ్వేతను సంప్రదించారు. అయితే ఆ చెక్కు పాస్‌ కావాలంటే ఎంపీడీవోను కలవాలని ఆమె చెప్పడంతో  కాంట్రాక్టర్‌ ఎంపీడీవోను కలిశారు. తన చెక్కును పాస్‌ చేయాలని ఎంపీ డీవో ఆల్బర్ట్‌ను కోరగా.. అందుకు రూ.20వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఆయన డిగిన లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి.. పథకం ప్రకారం కాంట్రాక్టర్‌ ఎంపీడీవోకు రూ.20వేలు లంచం ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని ప్రాథమిక విచారణ నిర్వహించారు. పంచనామా నిర్వహించి  ఎంపీడీవో కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో  ఏసీబీ అధికారులు రమణమూర్తి, క్రాంతి, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:15:47+05:30 IST