Abn logo
Jan 10 2021 @ 23:31PM

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

ఎదురెదురుగా ఢీ కొన్న ద్విచక్రవాహనాలు

ఖమ్మం రూరల్‌, జనవరి 10: ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన రూరల్‌ మండలం, కాచిరాజుగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డోర్నకల్‌ మండలం, తొడాలగూడెం గ్రామానికి చెందిన ముజాకర్‌ తన కూతురు మాధురి(3), ని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని ఖమ్మం వస్తున్నాడు. రూరల్‌ మండలం, కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన వీర్ల మహేష్‌, గోనే మహేష్‌ ఇద్దరు ఖమ్మం నుంచి ద్విచక్రవాహనంపై కాచిరాజుగూడెం వస్తున్నారు. కాచిరాజుగూడెం గ్రామ శివారులో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మాధురి అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. వీర్ల మహేష్‌, వీర్ల మహేష్‌, ముజాకర్‌లకు తీవ్ర గాయాలైయ్యాయి. వారిని గ్రామస్తులు 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రూరల్‌ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement