Advertisement
Advertisement
Abn logo
Advertisement

గచ్చిబౌలిలో ప్రమాదం.. యువకుడు మృతి

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు (18)మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం ఖాజా గూడా పీజేఆర్ నగర్‌కు చెందిన అరవింద్ (18), పెద్దనాన్న కొడుకు అరుణ్‌తో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్‌పై నానక్ రాంగూడ వైపు బయలుదేరారు. నానక్ రామ్ గూడా వద్ద బైక్ అదుపు తప్పి కింద పడడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఇద్దరిని ఆసుపత్రికి తరచారు.  అరవింద్ చికిత్సపొందుతూ ఈ రోజు మృతి చెందాడు. హెల్మెట్ లేకపోవడమే అరవింద్ మృతికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement