విరాట్‌ షాట్‌ చూసి జొకో నవ్వులు

ABN , First Publish Date - 2021-06-01T10:11:14+05:30 IST

ఫుట్‌బాల్‌ అంటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

విరాట్‌ షాట్‌ చూసి జొకో నవ్వులు

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ అంటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాకర్‌ మీద అభిమానంతో సమయం చిక్కినప్పుడల్లా ఆ క్రీడలోనూ నైపుణ్యం పెంచుకునేందుకు ఉత్సుకత చూపించే విరాట్‌ తాజాగా క్రాస్‌బార్‌ గోల్‌ కొట్టి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టాడు. దీనికి ‘యాక్సిడెంటల్‌ క్రాస్‌బార్‌ చాలెంజ్‌’ అనే క్యాప్షన్‌ను కూడా కోహ్లీ జత చేశాడు. కోహ్లీ గోల్‌ కొట్టిన విధానం చూసి సెర్బియా టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ పగలబడి నవ్వుతున్న ఎమోజీని కామెంట్‌గా పెట్టడం విశేషం. ఇక, టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్స్‌లోనూ విరాట్‌ ఆటవిడుపు కోసం సహచరులతో కలిసి ఫుట్‌బాల్‌నే ఆడుతుంటాడు. 

Updated Date - 2021-06-01T10:11:14+05:30 IST