యాక్షన్‌కు.. రియాక్షన్‌

ABN , First Publish Date - 2021-05-18T05:40:19+05:30 IST

యాక్షన్‌కు.. రియాక్షన్‌

యాక్షన్‌కు.. రియాక్షన్‌

మూడు రోజుల బంద్‌కు ప్రైవేటు దవాఖానాల యోచన

అధిక బిల్లులపై మంత్రి ప్రశ్నించిన నేపథ్యంలో కొందరి ప్రతిస్పందన

ఐఎంఏ నాయకులతో చర్చించిన పలు ఆసుపత్రుల నిర్వాహకులు

ప్రకంపనాలు సృష్టించిన ‘ఆంధ్రజ్యోతి కథనాలు’

ఖమ్మంసంక్షేమవిభాగం, మే 17: రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్న కొందరు ప్రైవేటు దవాఖానాల నిర్వాహకులు తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి విప రీత ధోరణి అవలంబిస్తున్నారు. కరోనా చికిత్స పేరుతో దోచుకుంటున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని, దోపిడీని సహిం చేది లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి.. సమీక్షలో చేసిన హెచ్చరికతో  ప్రైవేట్‌ వైద్యులు, ఐఎంఏ నాయకుల్లో నాయకుల్లో ప్రతిస్పందన మొదలైంది. కొంత మంది ఏకంగా ‘మూడురోజులు ఆసుపత్రులను బంద్‌ చేద్దా మా?’అని ఐఎంఏ నాయకులతో చర్చించినట్టు సమాచారం. 

సమీక్షలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రకంపనలు

కరోనారోగులపై చికిత్స పేరుతో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీని ఎప్పటి కప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ కథనాల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఈ కథనా లతో స్పందించి విచారణ చేసిన వైద్యశాఖ అధికారులు కొన్ని ఆసుపత్రులపై చర్యలు తీసుకునేందుకు సాంకేతిక అంశాలను సైతం పరిశీలిస్తు న్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఖమ్మం జడ్పీహాలులో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రైవేటు వైద్యులు, ఐఎంఏ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు చర్చకొచ్చాయి. పలువురు ఐఎంఏ నాయ కులు మాట్లాడుతూ మీడియాలో నెగెటివ్‌ వార్తలు వస్తున్నాయంటూ చర్చ లేవ నెత్తారు. స్పందించిన మంత్రి పువ్వాడ .. మీడియాలో వచ్చే వార్తలు నూరుశాతం ఖచ్చితమై ఉంటాయని, సమస్యలు బయటకు రాకుండా ఉంటే ఏలా తెలుస్తాయని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని మీడియా ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సమీక్షలో పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు అవలంబిస్తున్న తీరుపై సదరు నిర్వాహకులను ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మానవతా దృక్పథాన్ని మరుస్తున్నారంటూ మండిపడ్డారు. 

కొందరి తీరుతో ఐఎంఏ సంజాయిషీ 

మంత్రి పువ్వాడ అజయ్‌  ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతరం ఐఎంఏ నాయకుల మొబైల్‌ఫోన్లు మారుమోగాయి. ఒకరి తర్వాత మరొకరు ప్రైవేటు వైద్యులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రైవేటు వైద్యుల్లో ఆత్మపరిశీలన ప్రారంభమైంది. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై వారిలో వారే చర్చించు కున్నారు. ఖమ్మంలో 70ప్రైవేట్‌ దవాఖానాల్లో కొవిడ్‌ వైద్యసేవలు అందిస్తుండగా, వాటిలో కేవలం పది లోపు ఆసుపత్రులు అడ్డగోలుగా బిల్లుల రూపంలో కరోనా రోగుల నుంచి దండుకోవడాన్ని తప్పుపట్టారు. కొందరు యాజమాన్యాల తీరుతో ఖమ్మం ఐఎంఏ వైద్యులు దోషులుగా సంజాయిషీ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిం దని అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ వర్గం వైద్యులు మూడు రోజులపాటు ప్రైవేట్‌ ఆసుపత్రులను బంద్‌ చేద్దా మ ని ప్రతిపాదించగా ఇండి యన్‌ మెడికల్‌ అసోసియేషన్‌  నాయ కులు వారించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల తప్పిదాలు బాహాటంగా  కనిపిస్తుండగా, ఇలాంటి డిమాండ్‌ ఎలా చేస్తా రని ప్రశ్నించిన కొందరు ఐఎంఏ నాయకులు.. ఇదే జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ చెడ్డపేరు వస్తుందంటూ మందలించారు. 

బిల్లుల నిర్ణయానికి కమిటీ?

కరోనావైరస్‌ కారణంతో నర్సింగ్‌, పారిశుధ్యఉద్యోగులు వేతనాలుపెంచామని,ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను ఎలా అమలుచేస్తామని ప్రైవేట్‌ వైద్యులు ఐఎంఏ నాయ కులతో అన్నారు. జిల్లాలో ఓ కమిటీని వేసి ఆసుపత్రుల్లో సేవలకు రేట్లను నిర్ణయించాలని కోరారు. దోపిడీ చేసే ప్రైవేట్‌ హాస్పటల్స్‌పై కఠినచర్యలు తీసుకోవాలని,అదేక్రమంలో ఎంతో అనుభవంతో రాత్రింబవళ్లు సేవలందిస్తున్న వారిని గుర్తించాలని ప్రైవేట్‌ వైద్యులు కోరారు.

Updated Date - 2021-05-18T05:40:19+05:30 IST