ఘనీభవించిన సముద్రచేపపై సజీవ ‘కరోనా’

ABN , First Publish Date - 2020-10-19T09:54:29+05:30 IST

ఘనీభవించిన సముద్ర చేపపై సజీవంగా ఉన్న కరోనా వైరస్‌ జాడను గుర్తించినట్లు చైనాకు చెందిన సెంటర్‌ ఫర్

ఘనీభవించిన సముద్రచేపపై సజీవ ‘కరోనా’

బీజింగ్‌, అక్టోబరు 18: ఘనీభవించిన సముద్ర చేపపై సజీవంగా ఉన్న కరోనా వైరస్‌ జాడను గుర్తించినట్లు చైనాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రకటించింది. విదేశాల నుంచి క్వింగ్‌డావో నగరంలోని శీతల గిడ్డంగికి దిగుమతి అయిన ఘనీభవించిన సముద్ర చేపల స్టాక్‌ను పరీక్షించగా ఈ విషయం బయటపడినట్లు తెలిపింది.


ఈ తరహాలో సజీవ కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని సీడీసీ వెల్లడించింది. ఇలా వైర్‌సతో కూడిన ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి ఊతమిస్తాయని హెచ్చరించింది. అయితే ఈ సముద్ర చేపలను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారనే విషయాన్ని బహిర్గత పర్చలేదు. ఈ నేపథ్యంలో చైనాలోని శీతల గిడ్డంగులకు దిగుమతి అయిన ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల 29.8 లక్షల శాంపిళ్లను పరీక్షించగా కేవలం 22 మాత్రమే ‘పాజిటివ్‌’ వచ్చాయని పేర్కొంది. 

Updated Date - 2020-10-19T09:54:29+05:30 IST