అదానీకి రుణాలపై ఎస్‌బీఐ వెనుకంజ !

ABN , First Publish Date - 2021-04-10T06:38:03+05:30 IST

ఆస్ట్రేలియాలో భారీ బొగ్గు ప్రాజెక్టు పూర్తి చేయాలన్న అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. పలు అంతర్జాతీయ బ్యాంకులతో కలిసి ఈ ప్రాజెక్టుకు 100 కోట్ల డాలర్ల రుణ సదుపాయం కల్పించేందుకు

అదానీకి రుణాలపై ఎస్‌బీఐ వెనుకంజ !

ఆస్ట్రేలియా బొగ్గు ప్రాజెక్టుపై అనిశ్చితి


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారీ బొగ్గు ప్రాజెక్టు పూర్తి చేయాలన్న అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. పలు అంతర్జాతీయ బ్యాంకులతో కలిసి ఈ ప్రాజెక్టుకు 100 కోట్ల డాలర్ల రుణ సదుపాయం కల్పించేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) 2014లో ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటి వరకు పైసా రుణం కూడా విడుదల చేయలేదు. కాగా ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా కూడా దీనిపై నోరు మెదపడం లేదు. 


కారణాలేమిటంటే: వాస్తవానికి  అదానీ ఎంటర్‌ప్రైజెస్‌  ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలో 2010లోనే కార్మిచాల్‌ అనే ఈ ప్రాజెక్టు చేపట్టింది. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్‌బీఐతో కలిసి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు అంగీకరించిన పలు అంతర్జాతీయ బ్యాంకులు తప్పుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు రుణం సమకూరిస్తే మీ గ్రీన్‌ బాండ్స్‌ లో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటామని కొన్ని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఎస్‌బీఐ దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేక పోతోంది. 

Updated Date - 2021-04-10T06:38:03+05:30 IST