రాష్ట్రానికి అదానీ ‘ప్రాణ’వాయువు

ABN , First Publish Date - 2021-05-27T08:57:20+05:30 IST

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం.. రాష్ట్రంలో ఆక్సిజన్‌ అవసరాలు తీర్చడానికి 20 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను బుధవారం రాష్ట్రప్రభుత్వానికి

రాష్ట్రానికి అదానీ ‘ప్రాణ’వాయువు

రెండు 20 టన్నుల లిక్విడ్‌ ట్యాంకర్లు, 403 సిలిండర్లు, 27 కాన్సన్‌ట్రేటర్ల వితరణ


ముత్తుకూరు, మే 26: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం.. రాష్ట్రంలో ఆక్సిజన్‌ అవసరాలు తీర్చడానికి 20 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను బుధవారం రాష్ట్రప్రభుత్వానికి అందజేసింది. అలాగే వివిధ జిల్లాలకు 403 ఆక్సిజన్‌ సిలిండర్లు, 27 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను పంపిణీ చేసింది. చిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రభుత్వాస్పత్రికి 150 ఆక్సిజన్‌ సిలిండర్లను, కడప కలెక్టరేట్‌కు 253 సిలిండర్లను కృష్ణపట్నం పోర్టు నుంచి పంపించారు. కడప కలెక్టరేట్‌కు 10 లీటర్ల కెపాసిటీ కలిగిన 27 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను గురువారం తరలించనున్నారు. కృష్ణపట్నం పోర్టుకు చేరే ఆక్సిజన్‌ ట్యాంకర్లను అన్‌లోడ్‌ చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నామని పోర్టు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకు తమ పోర్టు ద్వారా కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2021-05-27T08:57:20+05:30 IST